పత్రిక ఆవశ్యకత.. ఉద్దేశం ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధి లో పనిచేసే జే అధికార యంత్రాంగం. పాలన దయార్థ వీరు కీలక భూమిక పోషిస్తారని చెప్పడంలో అశియోక్తిలేదు. నిరంతరం ప్రజలకు ఏదో ఒక సేవ రూపంలో మమేకమవుతూ ఉంటారు. ప్రభుత్వ విధానాల ఝూపకల్ప లో ప్రజా అ కు అనుగుణంగా పథకాలను అమలు పరచడంలో అద్వితీయమైన పాత్ర పోషిస్తారు. పరిపాలనా విభాగంలోనూ ముఖ్యపాత్ర పోషించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్), శాంతి భద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ ో పాటు వివిధ శాఖలకు ముఖ్య కార్యదర్శులుగా వ్యవహరించేవారు. కలెక్టర్లు, ఎస్పీ అందరూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చినవారే. చదువులో అత్యంత ప్రతిభ కనబర్చి సమకాలీన అంశాలపై స్పష్టమైన అభిప్రాయం, సేవాగుణమున్న వారే సివిల్ సర్వీసెస్ లోకి వస్తుంటారు. ఈ రాష్ట్రస్థాయిలో అయితే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 ల తో పటు వివిధ శాఖల్లో జరిగే ఉద్యోగ అర్హత పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగాలు పొందినవారు ఉన్నారు నీతి, నిజాయితీలతో పని చేస్తే.. ప్రజల సేవకే అంకితమైన అధికారులు మనకు రోజూ ఎక్కడో ఒక చోట తార పడుతూనే ఉంటారు. అధికారి అంటే. కేవలం పరిపాలనకే పరిమితం కారు. అనేక వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం, బీడు భూములను సాగు భూములుగా మార్చడం, తాగునీరు లేక గొంతెండుతున్న మారుమూల ప్రాంతాల దాహార్తి తీర్చడం, రవాణా సౌకర్యాలు నోచుకోని పల్లెలకు తారు, బీటీ రోడ్డు వేయించడం, అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకోవడం, సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడటం లాంటి పనులు నిర్విరామంగా కొనసాగుతూ ఉంటారు. ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు కూడా నిరంతరం తపన పడుతుంటారు. ప్రజా సంక్షేమమే తమ పరమావధి అన్నట్టుగా పనిచేస్తున్న అధికారులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి, వారి నిస్వార్థ సేవను ప్రజల ముందు ఉంచేందుకు 'సాక్ష్యం. మీ ముందుకు వస్తోంది. అధికారులను కేవలం అడ్మినిస్ట్రేషన్ కోణంలో కాకుండా వారి అంతరంగాన్ని ఆవిష్కరించాలనేదే 'సాక్ష్యం' ప్రధాన ఉద్దేశం కళారంగంలోనూ, సాహిత్యంలోనూ, క్రీడారంగంలోనూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో అత్యంత ప్రతిభ కనబర్చిన అధికారులు ఉంటారు వారి మరో కోణాన్ని కూడా ఆవిష్కరించేందుకు సాక్ష్యం' సిద్ధంగా ఉంది.
For Further details, Contact us for all the queries
Main Building: House No.5-2-115/1, vaishnavi residency,khairatabhad x road, somaji guda Hyderabad.